‘సేవ’లు అంతంతే ! | - | Sakshi
Sakshi News home page

‘సేవ’లు అంతంతే !

Jul 22 2025 7:35 AM | Updated on Jul 22 2025 8:14 AM

‘సేవ’

‘సేవ’లు అంతంతే !

● మీ సేవా కేంద్రాల్లో తప్పని తిప్పలు ● రోజుకు 100 మందికి కూడా అందని సర్వీసులు ● శిథిల భవనాల్లోనే సెంటర్ల నిర్వహణ

ఇల్లెందు: జిల్లాలో మీ సేవా కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా.. వాటిలో వినియోగదారులకు అందే సేవలు మాత్రం అంతంతగానే ఉన్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వం ఏర్పాలు చేసిన కేంద్రాలు 11 ఉండగా ప్రైవేట్‌ సెంటర్లు సుమారు 100 ఉన్నాయి. ప్రతీ సంవత్సరం కొన్ని కొత్త కేంద్రాలకు అనుమతి ఇస్తున్నారు. ఇక కొన్ని మండలాల్లో నాలుగైదుకు తగ్గకుండా కేంద్రాలకు ఉండగా, ఇంటర్నెట్‌ సిగ్నల్‌ సరిగా లేని చోట సెంటర్లు ఏర్పాటు చేయలేదు. ఉన్నచోట కూడా ఆఽశించిన స్థాయిలో సేవలు అందడం లేదు. ము ఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని కేంద్రాలు సక్రమంగా పనిచేయక పట్టణాలకు పరుగు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మున్సిపాలిటీల వద్ద ఉన్న సెంటర్లకు తాకిడి పెరుగుతోంది. ఇల్లెందులోని మీ సేవా కేంద్రానికి ఇల్లెందు, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల మండలాల నుంచి వినియోగదారులు వస్తుండగా సదుపాయాలు అంతంతగానే ఉన్నా యి. కంప్యూటర్లు, స్కానర్లు, ఇతర పరికరాలు సరిగా పనిచేయక పోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు.

తీరని ఆధార్‌ గోస..

జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆధార్‌, కుల, ఆదాయ సర్టిఫికెట్లు, రేషన్‌కార్డులు తదితర అవసరాల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. ముఖ్యంగా ఆధార్‌కార్డుల్లో తప్పుల సవరణ, అప్‌డేట్‌ కోసం ఎక్కువ మంది వస్తున్నారు. పలువురికి ఆంధ్రప్రదేశ్‌, ఖమ్మం జిల్లా పేరుతోనే ఆధార్‌ కార్డులు ఉండగా.. వాటి సవరణ ల కోసం కూడా భారీగా వస్తున్నారు. ఇక ప్రజా పాలన గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు రావడం లేదు కానీ.. మీ సేవా కేంద్రంలో డబ్బు ముట్టజెప్పి దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే వస్తుండడంతో వారు కూడా పోటెత్తుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో 11 కేంద్రాలు..

ఉమ్మడి జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, మధిర, వైరా, సత్తుపల్లి, పాల్వంచ, అశ్వారావుపేట, ఏదులాపురం, కల్లూరులో మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. ప్రతీ మున్సిపాలిటీలో ఒక మీ సేవా కేంద్రం ఉంది. వాటిలో 100కు పైగా సేవలు అందుతున్నాయి. కానీ ఏ కేంద్రంలోనూ మూడుకు మించి కంప్యూటర్లు లేవు. ఉన్నవి కూడా సక్రమంగా పని చేయడం లేదు. ఫర్నిచర్‌ విరిగి, లైట్లు, ఫ్యాన్లు పనిచేయక, భవనాలు శిథిలావస్థకు చేరడంతో అటు నిర్వాహకులు, ఇటు వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

అత్యవసర సేవల్లో జాప్యం..

ఇది ఇల్లెందులోని మీ సేవా కేంద్రం. ఇక్కడ ఏ ఒక్క లబ్ధిదారుడికీ సేవలు అంత సులభంగా లభించవు. కొన్ని నెలలుగా స్టేషనరీ సరఫరా కావడం లేదు. నలుగురు కంప్యూటర్‌ ఆపరేటర్లకు ముగ్గురే పని చేస్తున్నారు. ఇందులోనే ఒకరిని ఆధార్‌ కార్డులకు, మరొకరిని బిల్లులు, సర్టిఫికెట్ల జారీకి కేటాయించారు. ఏ కంప్యూటర్‌ చూసినా సర్వర్‌ బిజీ వస్తోందని ఆపరేటర్లు సమాధానం చెబుతున్నారు. దీంతో భారీ సంఖ్యలో సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంటున్నాయి.

‘సేవ’లు అంతంతే !1
1/2

‘సేవ’లు అంతంతే !

‘సేవ’లు అంతంతే !2
2/2

‘సేవ’లు అంతంతే !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement