
అలంకార ప్రాయంగా అటవీ చెక్ పోస్టులు
పాల్వంచరూరల్: వైల్డ్‌లైఫ్ పాల్వంచ డివిజన్ విభాగంలో వన్యప్రాణుల సంరక్షణతో పాటు కలప స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో సిబ్బంది లేక అలంకార ప్రాయంగా మారుతోంది. యానంబైల్ రేంజ్ పరిధిలోని మొండికట్ట వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసినా.. కొద్ది రోజులుగా తాళం వేసి ఉంటోంది. ఇక్కడ విధులు నిర్వహించే ఎఫ్‌బీఓ మోహన్‌కు రేగులగూడెంలో రెండు బీట్ల బాధ్యతలు అప్పగించారు. అయితే చెక్‌పోస్టు పర్యవేక్షణ బాధ్యతను మాత్రం ఎవరికీ అప్పగించలేదు. మొండికట్టలో విధులు నిర్వహించే సురేష్‌కుమార్ డిప్యుటేషన్‌పై వెళ్లారు. యానంబైల్ బీట్ ఆఫీసర్ గ్రూప్–1 శిక్షణకు వెళ్లారు. కిన్నెరసాని చెక్‌పోస్టులో విధులు నిర్వహించే భట్టు రాములు ఉద్యోగోన్నతి పై దమ్మపేట రేంజ్‌కు వెళ్లారు. ఇలా ఈ రేంజ్ పరిధిలో మొత్తం 20 మంది విధులు నిర్వహించాల్సి ఉండగా అరకొర సిబ్బంది కారణంగా చెక్‌పోస్టులో ఎవరూ ఉండడం లేదని తెలుస్తోంది. రేంజ్ పరిధిలో వన్యప్రాణులు, అభయారణ్యంలోని కలప అక్రమ రవాణాను నిరోధించేందుకు ఆరేళ్ల క్రితం ఉల్వనూరు – పాల్వంచ మార్గంలోని మొండికట్ట వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. కానీ సిబ్బంది లేక అది నిరుపయోగంగానే ఉంది. ఈ విషయమై ఇన్‌చార్జ్ ఎఫ్‌డీఓ కృష్ణమాచారిని వివరణం కోరగా మొండికట్ట చెక్‌పోస్టులో విధులు నిర్వహించే ఎఫ్‌బీఓకు రేగులగూడెంలో రెండు బీట్లకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. సిబ్బంది కొరత ఉందని, ఖాళీల భర్తీకి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. చెక్‌పోస్టు వద్ద త్వరలోనే ఒకరిని నియమిస్తామన్నారు.
వైల్డ్‌లైఫ్ విభాగాన్ని వేధిస్తున్న సిబ్బంది కొరత