
నేరాలు, ప్రమాదాల నియంత్రణకే కార్డన్ సెర్చ్
ఇల్లెందురూరల్: నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను తెలిపారు. మండలంలోని 21 పిట్ ఏరియాలో సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను అతి వేగంగా, అజాగ్రత్తగా నడపొద్దని కోరారు. వీటితో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూ చించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అన్నా రు. గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అంతకు ముందు ఇంటింటికీ వెళ్లి వాహనాలను పరిశీలించా రు. రిజిస్ట్రేషన్ పేపర్లు, ఇతర పత్రాలు లేని వాహనాలను పోలీసుస్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో సీఐలు రవి, సురేష్, ఎస్సైలు శ్రీనివాసరెడ్డి, సూర్య, నాగుల్‌మీరా, హసీనా పాల్గొన్నారు.
ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను