
పుట్టిన రోజు నాడే అనంతలోకాలకు..
కొత్తగూడెంఅర్బన్: పుట్టినరోజు నాడే ఓ ఆటో డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన లక్ష్మీదేవిపల్లిలో శనివారం జరిగింది. కొత్తగూడెంలోని ప్యూన్ బస్తీకి చెందిన సుమో జాన్(50) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున కిరాయికి వెళ్లి వస్తుండగా ముర్రేడు బ్రిడ్జిపై డీసీఎం వ్యాన్ ఆటోను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, శనివారం పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు కుటుంబసభ్యులు సిద్ధమవుతున్న తరుణంలో జాన్ మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. భార్య, ముగ్గురు పిల్లలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన డీసీఎంను చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఓ షాపింగ్ మాల్ వద్ద పార్క్ చేసి, డ్రైవర్ పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో
మృతిచెందిన ఆటో డ్రైవర్