
మొదటి కాన్పులో సిజేరియన్
ఇల్లెందు: మొదటికాన్పులో సిజేరియన్ జరిగిన ఓ మహిళ వైద్యుల సూచనలు పాటిస్తూ రెండోసారి నార్మల్ డెలివరీ పొందింది. కరకగూడెం మండలం మద్దెలగూడెం గ్రామానికి చెందిన చీమల ఈశ్వరయ్య భార్య లావణ్య రెండో కాన్పు కోసం సుదిమళ్లలోని పుట్టింటికి వచ్చింది. శనివారం పురిటి నొప్పులు రాగా ఇల్లెందు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్ ప్రియాంక, స్టాఫ్ నర్సు అనూష తగిన వైద్యసేవలందించి సాధారణ కాన్పు పొందేలా చూశారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. డాక్టర్, స్టాఫ్ నర్స్‌ను సూపరింటెండెంట్ డాక్టర్ హర్షవర్ధన్, ఆర్‌ఎంఓ రాంనివాస్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి. రవిబాబు అభినందించారు.
రెండోసారి నార్మల్ డెలివరీ