
మతతత్వం దేశానికి ప్రమాదం
ఇల్లెందు: దేశంలో రోజురోజుకూ బీజేపీ, ఆర్‌ఎస్ ఎస్‌ల మతతత్వం పెరిగిపోతోందని, ఇది దేశానికి ప్రమాదమని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ అన్నారు. ఇల్లెందులోని చండ్ర కృష్ణమూర్తి(ఎల్లన్న) మెమోరియల్ ట్రస్ట్ భవన్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. దేశంలో యూనివర్సిటీలకు, మీడియాకు స్వతంత్రం లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్య విలువలపై, రాజ్యాంగంపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మతతత్వ విధానాలపై సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగా రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని విమర్శించారు. బ్రోకర్లు దర్జాగా డబ్బులు తీసుకుని 24 గంటల్లో రేషన్ కార్డులు ఇస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్స య్య మాట్లాడుతూ ఇల్లెందుకు సీతారామ జలాలు ఇవ్వకుండా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన రాజీవ్‌సాగర్ ప్రాజెక్ట్‌ను కొనసాగించాలని కోరారు. ఆంఽక్షలు లేకుండా ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు కిచ్చెల రంగయ్య, కేజీ రాంచందర్, చండ్ర అరుణ, కే.రమ, జి.వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, నంది రామయ్య, సదానందం, జిల్లా కార్యదర్శి ముద్ధా భిక్షం, పాయం చిన్న చంద్రన్న, డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్
ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్ ఠాగూర్