
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దు
జూలూరుపాడు: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు. గురువారం మండలంలోని మాచినేనిపేటతండాలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ఇంటింటికీ వెళ్లి సోదాలు నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాలను గుర్తించేందుకు జాగిలంతో తనిఖీలు చేపట్టారు. కార్డెన్ సెర్చ్‌లో రూ 4 వేల విలువైన నాటుసారా, రూ.15 వేల విలువైన మద్యం బాటిళ్లు, రూ.3,500 విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. సరైన ధ్రువపత్రాలులేని 65 వాహనాలకు రూ.8,900లు జరిమానా విధించారు. అనంతరం మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రతాప్, 12మంది ఎస్‌ఐ లు, 60మంది పోలీస్ సిబ్బంది కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్