
ఓసీ పనులు వేగవంతం చేయాలి
ఇల్లెందు: ఇల్లెందులో నూతన ఓసీ పనులు వేగవంతం చేయాలని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆయన కేఓసీలో పర్యటించి అక్కడి బొగ్గు ఉత్పత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓసీలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. అధికారులు వీసం కృష్ణయ్య, రాధాకృష్ణ, రామస్వామి, గిరిధర్‌రావు, గోవిందరావు, నరసింహరాజు, జాకీర్ హుస్సేన్, రవికుమార్, నాగరాజు నాయక్, రామూర్తి, శివవీరకుమార్ పాల్గొన్నారు.