
సుమనోహరం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించి, మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పెద్దమ్మతల్లిని ఈనెల 20న శాకాంబరీ రూపంలో అలంకరించనున్నట్లు ఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.
కంప్యూటర్ విద్యపై
పట్టు సాధించాలి
● డీఈఓ వెంకటేశ్వరా చారి
మణుగూరు రూరల్ : విద్యార్థులు చదువుతో పాటు కంప్యూటర్ విద్యపైనా పట్టు సాధించాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరా చారి అన్నారు. మణుగూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ప్రయోగశాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీవితంలో ఎదిగేందుకు విద్య గొప్ప ఆయుధంలా దోహదపడుతుందని అన్నారు. ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఎంఓ సైదులు, ఏఎంఓ నాగరాజశేఖర్, ఎంఈఓ జి.స్వర్ణజ్యోతి, సాంబాయిగూడెం కాంప్లెక్స్ హెచ్‌ఎం ఎం.శ్రీలత, ఎమ్మార్పీలు ఎం.విష్ణు, పి.బాలరాజు, పి.రామకృష్ణ, కె.రాంబాబు, ఐ.బాలాజీ, ఐ.రమేష్, టి. శ్రీకాంత్, హెచ్‌ఎం బ్రహ్మయ్య, బి.విజయ, ఏఏపీసీ చైర్మన్ ఉత్తమకుమారి పాల్గొన్నారు.
నానో యూరియానే వినియోగించాలి
బూర్గంపాడు: రైతులు గుళికల యూరియా స్థానంలో ద్రవ రూపంలో ఉండే నానో యూరి యా వినియోగాన్ని పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు సూచించారు. బూర్గంపాడు పీఏసీఎస్‌లో యూరియా విక్రయాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నానో యూరియాతో అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. గుళికల యూరియా కంటే బాగా పనిచేస్తుంద ని, పంటల దిగుబడి పెరుగుతుందని తెలిపా రు. నానో యూరియాతో భూగర్భ జలాల్లోకి నత్రజని చేరదని, తద్వారా భూసారం బాగుంటుందని అన్నారు. అర లీటర్ నానో యూరి యా ఒక బస్తా యూరియాతో సమానమన్నారు. ఇది రవాణాకు కూడా తేలికగా ఉంటుందని, కూలీల ఖర్చు తగ్గుతుందని వివరించారు. కార్యక్రమంలో ఏఓ శంకర్ పాల్గొన్నారు.

సుమనోహరం.. రామయ్య కల్యాణం

సుమనోహరం.. రామయ్య కల్యాణం

సుమనోహరం.. రామయ్య కల్యాణం