
నిండని తుమ్మలచెరువు
● ఆయకట్టులో ప్రశ్నార్థకంగా మారిన వరిసాగు ● సీతారామ జలాలు ఇవ్వాలని కోరుతున్న రైతులు
అశ్వాపురం: కాకతీయులకాలం నాటి తుమ్మల చెరువు ఆయకట్టులో ఖరీఫ్ వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో చెరువులో ఇంకా నీరు చేరలేదు. ఆయకట్టులో పోసిన వరినార్లు ఎండిపోతున్నాయి. దీంతో సుమారు 10 వేల మంది రైతులు, వేలాది మంది రైతు కూలీలు ఆందోళన చెందుతున్నారు.
ముందుకు సాగని మారెళ్లపాడు లిఫ్ట్ పనులు
సీతారామ ప్రాజెక్ట్ ద్వారా తుమ్మలచెరువుకు నీరు అందించేందుకు బీజీ కొత్తూరు పంప్‌హౌస్ సమీపంలో మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. రెండేళ్లు గడిచినా పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పనులను సందర్శించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాగా ఈ ఖరీఫ్‌కు దీనిద్వారా నీరు ఇవ్వడం సాధ్యం కాదు. తుమ్మలచెరువుకు మూడు కాలువలు ఊరవా యి, కుందారం, చదలవాడ కాలువలు ఉన్నాయి. ఇవి సీతారామకాలువ సమీపంలోనే ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీతారామ ప్రధాన కాలువకు అనువైన ప్రదేశంలో గేట్‌వాల్వ్ ఏర్పాటు చేసి, మోటార్లు, పైపుల ద్వారా తాత్కాలికంగా చెరువు కాలువల్లోకి నీరు ఇచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎమ్మెల్యే, నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి తుమ్మలచెరు వు కాలువలకు నీరు అందించేలా చర్యలు తీసుకో వాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
సాగు నీరు ఇవ్వాలి
చెరువు ఆయకట్టులో వరినారు పోశాం. వర్షాల్లేక నారు ఎండిపోతోంది. ఈ వానాకాలం సీజజన్‌లో తుమ్మల చెరువు కింద వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం స్పందించి సీతారామ నీళ్లు ఇవ్వాలి. –కమటం వెంకటేశ్వరరావు,
ఆయకట్టు రైతు, మొండికుంట

నిండని తుమ్మలచెరువు