
విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రణాళికలు
పాల్వంచ: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు వివిధ క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. గురువారం స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో టేబుల్ టెన్నిస్ క్రీడలను శిక్షణ కలెక్టర్ సౌరభ్ శ ర్మతో కలిసి ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు వ్యాసరచన, ఉపన్యాసం పోటీలతో పాటు కుట్టడం, అల్లికలు, కరాటే తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఐదు పాఠశాలల్లో హాకీ, హ్యాండ్‌బాల్, బాల్ బాడ్మింటన్, రెజ్లింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈమేరకు విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్, స్పోర్ట్స్ అధికారి గోపాలరావు, అసిస్టెంట్ స్పోర్ట్స్ అధికారి వెంకటనారాయణ, హెచ్‌ఎం భద్రం, వార్డెన్ పవన్, గోపాలరావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.