
కలెక్టర్‌కు అవార్డులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఐఐటీ బాంబేలో నిర్వహించిన ఓపెన్ సోర్స్ డేలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డుతో పాటు ఓపెన్ సోర్స్ జీఐఎస్ కోహార్ట్ అవార్డులను గురువారం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ మాజీ చైర్మన్ ఏ.ఎస్.కిరణ్‌కుమార్ చేతులమీదుగా అందుకున్నారు. జిల్లాలో గ్రామీణ సమస్యల పరిష్కారం కోసం జియో స్పేషియల్ టెక్నాలజీ నిపుణులతో నిర్వహించిన మొదటి ఓపెన్ సోర్స్ జీఐఎస్ సదస్సు నిర్వహణకు, జిల్లా సమస్యలను లోకల్ స్థాయిలో పరిష్కరించేలా చేసినందుకు ఈ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐఐటీ బాంబే సాంకేతిక పరిజ్ఞానాన్ని జిల్లాకు తీసుకొచ్చి రైతులు, విద్యార్థులు, అధికారులు అందరికీ ఉపయోగపడేలా చేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగానే జీఐఎస్ సాయంతో పత్తి, మొక్కజొన్న పొలాలను మ్యాప్ చేసి రైతులను మునగసాగు వైపు మళ్లించే ప్రయత్నం మొదలు పెట్టామని, మేకల పెంపకం, మేక పాల ఉత్పత్తి పెంపుదలపై పరిశీలనలు జరుగుతున్నాయని వివరించారు. ఈ అవార్డులు జిల్లాకు గర్వకారణమని వ్యాఖ్యానించారు.