
గ్రంథాలయ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
కొత్తగూడెంఅర్బన్ : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా కాంగ్రెస్ నాయకుడు పసుపులేటి వీరబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని లైబ్రరీలను త్వరలో పరిశీలిస్తానని, గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని, వాటిని ఆదర్శంగా నిలుపుతామని చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుకుల, పాఠకులకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. అంతకుముందు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కరుణకుమారి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ జి.మణిమృదుల, ఆఫీస్ ఇన్‌చార్జ్ ఎం.నవీన్‌కుమార్, నాగన్న, మధుబాబు, నాయకులు పల్లె వరప్రసాద్, జల్లారపు ఈశ్వర్, బండి శ్రీకాంత్‌గౌడ్, లావుడియా నరేష్ పాల్గొన్నారు.