
సమస్యల పరిష్కారానికి కృషి
ఇల్లెందు/టేకులపల్లి: ప్రభుత్వానికి, ఉపాధ్యాయ సంఘాలకు మధ్య అనుసంధానకర్తగా పని చేస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పీఆర్‌టీయూ నాయకుడు, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్‌లో, టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎంజేపీ బీసీ బాలుర గురుకులంలో పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉపాఽధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని తెలిపారు. ఈహెచ్‌ఎస్ స్కీం అందరికీ అనువుగా ఉండేలా, సింగరేణిలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఉద్యోగుల హెల్త్ స్కీం అమలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీని ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దామోదర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.శ్రీనివాస రెడ్డి, నాయకులు ధనికొండ శ్రీనివాస్, తన్నీరు శ్రీనివాస్, దశమ్ బాబు, విజయ నిర్మల, పి. నర్సయ్య, సీహెచ్ ప్రభాకర్‌రావు, రవీందర్, కె. శేఖర్, రంగారావు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి