
న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి
కొత్తగూడెంటౌన్: న్యాయవాదుల సంక్షేమానికి, కొత్త కోర్టులు, హెల్త్ కార్డులు, ఇంటి స్థలాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ కోరారు. బుధవారం కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలోని లైబ్రరీ హాల్‌లో కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు వెల్లంకి వెంకటేశ్వరావు అధ్యక్షతన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోతుకూరి ధర్మారావు, నాగసీతారాములు, రాజ్యాంగ పరిరక్షణ కమిటీ సభ్యుడు జేబీ శౌరి, జైభీమ్‌రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఝెర్రా కామేషలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కోర్టు, ఫ్యామిలీ కోర్టు లేబర్‌కోర్టు నూతన న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని అన్నారు. న్యాయవాదుల హెల్త్ కార్డుల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, రేపా క వెంకటరత్నం, పలివెల సాంబశివరావు, వీవీ సుధాకర్‌రావు, వైవీ రామారావు, రావి విజయ్‌కుమార్, ఊట్ల రాజేశ్వరావు, ఎర్రపాటి కృష్ణ పాల్గొన్నారు.
కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ