
మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు
ఇల్లెందు: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూర్య(సీతక్క), రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, పౌరసమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురవారం ఇల్లెందుకు రానున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో సభా ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహిళలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. బ్యాంకు లింకేజీ, రుణ బీమా, రేషన్ కార్డులు అందజేయనున్నారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, కోరం సురేందర్, లక్కినేని సురేందర్, మండల రాము, డానియేల్, పులి సైదులు, మడుగు సాంబమూర్తి, సూర్యం, కిరణ్, భిక్షం, చిల్లా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.