ప్రైవేటు ఆస్పత్రి సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆస్పత్రి సీజ్‌

Jul 17 2025 3:34 AM | Updated on Jul 17 2025 3:34 AM

ప్రైవ

ప్రైవేటు ఆస్పత్రి సీజ్‌

అశ్వారావుపేట: అశ్వారావుపేటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.జయలక్ష్మి సీజ్‌ చేశారు. అనుమతులు లేకుండా క్లినిక్‌లు, ల్యాబ్‌లు, మెడికల్‌ షాపులు నిర్వహించొద్దని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న, అర్హత కలిగిన వైద్యుల క్లినిక్‌లకు మాత్రమే ప్రజలు వెళ్లాలని సూచించారు. అనంతరం వినాయకపురం పీహెచ్‌సీని సందర్శించారు. డీఎంహెచ్‌ఓ వెంట ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ మధువరుణ్‌, డీడీఎంహెఓచ్‌వో ఫైజ్‌ మోహియుద్దీన్‌ ఉన్నారు.

వెలిసిన మావోయిస్టుల వ్యతిరేక పోస్టర్లు

బూర్గంపాడు/పాల్వంచరూరల్‌: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో బుధవారం ప్రజాఫ్రంట్‌ పేరుతో మావోయిస్టుల వ్యతిరేక పోస్టర్లు వెలిశాయి. బూర్గంపా డు మండలం కొసగుంపు, చింతకుంట, ఉర్లదోసపల్లి, గోపాలపురం, రాజీవ్‌నగర్‌ వలస ఆదివాసీ గ్రామాల్లో, పాల్వంచ మండలం రెడ్డిగూడెం ఎస్టీకాలనీ, ఒంటిగుడిసె, ఉల్వ నూరు, చండ్రాలగూడెం తదితర గ్రామాల్లో పోస్టర్లు అంటించారు. మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పోస్టర్లలో పేర్కొన్నారు.

సింగరేణీయుల పిల్లలకు ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు

సింగరేణి(కొత్తగూడెం): 2025–26 విద్యాసంవత్సరంలో సింగరేణి మెడికల్‌ కశాశాలలో ఎంబీబీఎస్‌ ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఎం.శాలేంరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. రామగుండంలోని సింగరేణి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (సిమ్స్‌)లో ఏడు సీట్లను ఉద్యోగుల కోటా కింద భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన సింగరేణి అధికారులు, కార్మికుల పిల్లలు అర్హులని తెలిపా రు. ర్యాంక్‌ ఆధారంగా స్పాన్సర్‌షిప్‌ కల్పిస్తామని, సంబంధిత మైన్స్‌/ డిపార్ట్‌మెంట్లలో సంప్రదించి ఈ నెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.

ప్రవేశాల పెంపునకు

కృషి చేయాలి

అశ్వారావుపేట: అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రవేశాల సంఖ్య పెంచేలా ప్రతీ లెక్చరర్‌ కృషి చేయాలని ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ డిప్యూటీ సెక్రటరీ సీహెచ్‌ హేమచంద్ర సూచించారు. బుధవారం ఆయన కళా శాలను సందర్శించారు. కళాశాల గదులు, రికా ర్డుల పరిశీలన అనంతరం అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రాపవుట్స్‌ను తగ్గించాలని సూ చించారు. ప్రిన్సిపాల్‌ ఎ.అనిత పాల్గొన్నారు.

లారీలను అడ్డుకున్న గ్రామస్తులు

మణుగూరు రూరల్‌ : తమ గ్రామం మీదుగా ఇసుక లారీలు, బొగ్గు లారీలు రాకపోకలు సాగిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ మండలంలోని రాజుపేట గ్రామస్తులు బుధవారం లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లారీల వల్ల దుమ్ము, ధూళి ఎగిసిపడి అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీడ్‌ బ్రేకర్లు, దుమ్ము లేవకుండా వాటర్‌ స్ప్రే ఏర్పాటు చేయడంలేదని ఆరోపించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. సింగరేణి అధికారులు వచ్చి స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.

యువకుడి ఆత్మహత్య

ఖమ్మంరూరల్‌: మండలంలోని పడమటితండాకు చెందిన యువకుడు తమ్మోజు విఘ్నేశ్‌ చా రి (20) ఈనెల 3న గడ్డి మందు తాగి, చికి త్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఖమ్మంలో వెల్డింగ్‌ పనిచేస్తున్న యువ కుడికి ఖమ్మానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గమనించిన యువతి తండ్రి చంపుతానని బెదిరించినట్లు తెలి సింది. దీంతో యువకుడు ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రైవేటు ఆస్పత్రి సీజ్‌1
1/2

ప్రైవేటు ఆస్పత్రి సీజ్‌

ప్రైవేటు ఆస్పత్రి సీజ్‌2
2/2

ప్రైవేటు ఆస్పత్రి సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement