
వేగంగా రుణాల జారీ
సభ్యులకు త్వరగా రుణాలు జారీ చేస్తుండడం, రికవరీ కూడా బాగుండడంతో సంఘం అభివృద్ధి సాధిస్తోంది. ఖరీఫ్, రబీలో ధాన్యాన్ని ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నారు. పంటల నిల్వకు గోదాం కూడా నిర్మించారు.
–కంభం శేషయ్య, పీఏసీఎస్ సభ్యుడు
వార్డెన్ హాస్టల్‌లో
మద్యం తాగుతున్నారు..
ములకలపల్లి: వార్డెన్ హాస్టల్‌లో మద్యం తాగుతున్నారని, మత్తులో చేయి చేసుకుంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ములకలపల్లి ఎస్సీ బాలుర హాస్టల్‌కు హాస్టర్ వెల్ఫేర్ ఆఫీసర్ (వార్డెన్)గా శ్రీధర్ ఇటీవల నియమితులయ్యారు. అతను మిత్రులతో కలిసి హాస్టల్‌లో మద్యంతాగుతున్నారని, హాస్టల్‌లోనినూనె డబ్బా లను బయటకు తరలిస్తున్నారని వీడియోలో తెలి పారు. విద్యార్థులను బూతులు తిడుతూ, కొడుతున్నారని పేర్కొన్నారు. తప్పతాగి విద్యార్థులపై దాడికి పాల్పడుతున్న వార్డెన్ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా ఇన్‌చార్జి రాంచరణ్ తేజ్, నాయకులు అరవింద్, నాగతేజ తదితరులు బుధవారం జిల్లా సాంఘిక సంక్షేమాధికారికి వినతిపత్రం అందజేశారు. కాగా ఈ ఘటనపై జిల్లా సాంఘిక సంక్షేమాధికారి అనసూయను వివరణ కోరగా.. ఫిర్యాదు అందిందని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గంజాయి స్వాధీనం
కొత్తగూడెంఅర్బన్: సీలేరు నుంచి ఆటోలో తరలిస్తున్న గంజాయిని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి కథనం ప్రకారం.. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని లోతువాగు అటవీ ప్రాంతం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మహబూబాబాద్ రంగశాయిపేటకు చెందిన బండి వెంకటేశ్వర్లు ఆటోలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. రూ.15లక్షల విలువైన 31.93 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
విద్యార్థులు ఆరోపిస్తున్న వీడియో వైరల్

వేగంగా రుణాల జారీ