
రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి
సింగరేణి(కొత్తగూడెం): ఈ ఏడాది కూడా ప్రమాద రహిత సింగరేణికి కృషి చేయాలని, రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సింగరేణి (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) డైరెక్టర్ కే.వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఆర్‌సీఓఏ క్లబ్‌లో కొత్తగూడెం ఏరియా జీఎం ఎం శాలేంరాజు అధ్యక్షతన ఇల్లెందు, కొత్తగూడెం ఏరియాల 19వ, 17వ రక్షణ త్రైపాక్షిక సమావేశం జరిగింది. జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన సమావేశాన్ని ప్రారంభించారు. రక్షణ ప్రతిజ్ఞ చేశారు. గత సమావేశ మినిట్స్, 12వ, నేషనల్ సేఫ్టీ కాన్ఫరెన్స్ మిని ట్స్‌పై తీసుకున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ రక్షణ చర్యలు పాటించాలని చెప్పారు. ఆ తర్వాత డీడీఎంస్, డీజీఎంఎస్‌లు గనుల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరాతీశారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రమాదాలు జరగకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేసిసందుకు రెండు ఏరియాల జీఎంలను అభినందించారు. ఇదే స్ఫూర్తి తో రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు ఉమేష మధకర్‌రావు సవార్కర్, ఎస్.ఆనంద్‌వెల్, చింతల శ్రీని వాస్, సనత్‌కుమార్, కమలేష్ కుమార్, దిలీప్ కుమార్, ఎస్‌కే నాగుల్ మీరా, అంకిత్ సింగ్, కృష్ణయ్య, యూనియన్ నాయకులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు