పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌! | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌!

Jul 16 2025 4:03 AM | Updated on Jul 16 2025 4:03 AM

పాఠశా

పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌!

కొత్తగూడెంఅర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్య, బోధన, భవనాలు, సౌకర్యా లు ఇలా అన్నీ దశలవారీగా ఏర్పాటు అవుతున్నా యి. ఈ క్రమంలో పాఠశాలల్లో అడ్మిషన్లు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. కానీ, విద్యాశాఖ ఉన్నత అధికారులు, మండలస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోందనే ఆరోపణలున్నా యి. పర్యవేక్షణ పూర్తిస్థాయిలో ఉంటే కార్పొరేట్‌, ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారే అవకాశం ఉంది. గతంలో ఉపాధ్యాయుల పనితీరుకు గ్రేడింగ్‌ ఇచ్చే ఆలోచన చేయగా.. ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలకు తెరలేపడంతో అధికారులు వెనక్కి తగ్గారు. గ్రేడింగ్‌ ప్రక్రియ ఉంటే పోటీతత్వం పెరిగి బోధనలో మార్పులు వచ్చే అవకాశం ఉండేదని పలువురు చెబుతున్నారు. అలాంటి మంచి కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాలు అడ్డుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యారంగానికి అనేక సంక్షేమ పథకాలు, నిధులు విడుదల చేస్తున్న క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2012–13లో కంప్యూటర్‌ విద్య నేర్పించేందుకు ప్రత్యేక ఫ్యాకల్టీ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. 129 పాఠశాలల్లో 812 కంప్యూటర్లు ఏర్పాటు చేశా రు. మరుసటి ఏడాది అవి దెబ్బతినడంతో బోధన, కంప్యూటర్లను అటకెక్కించారు. ఆ తరువాత 2016–17లో 49 పాఠశాలలకు కంప్యూటర్లు మరమ్మతులు చేయించేందుకు రూ.2 వేల చొప్పున విడుదల చేయగా.. అవి సరిపోక కంప్యూటర్లు అలా గే ఉండిపోయాయి. అనంతరం జిల్లాలోని కొన్ని పాఠశాలలకు కంప్యూటర్లు నేరుగా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచే మంజూరు చేస్తున్నారని, దీంతో ఏఏ పాఠశాలల్లో ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయనే వివరాలపై స్పష్టత లేదని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.

డిజిటల్‌ బోధన కూడా అంతంతే..!

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్‌ బోధన చేసే ఉద్దేశంతో మొత్తం 270 పాఠశాలల ను ఎంపిక చేసి ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ (ఐఎఫ్‌పీ)లను తరగతి గదుల్లో ఏర్పాటు చేశారు. ప్యానళ్లు ఏర్పా టు చేసిన పాఠశాలల్లో 80 శాతం వరకు సాధారణ బోధన, 20శాతం వరకు డిజిటల్‌ బోధన నడు స్తోంది. ప్యానల్స్‌ ఏర్పాటు చేసిన చోట ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ప్యానళ్లకు నెట్‌కావాలంటే సెల్‌ఫోన్ల ద్వారా కనెక్షన్‌ ఇచ్చి డిజిటల్‌ బోధన చేస్తున్నారు. అయితే, తరగతి గదుల్లో సెల్‌ఫోన్లు వినియోగించకూడదనే నిబంధన అడ్డువస్తోంది.

జిల్లాలో 148 పాఠశాలలు ఎంపిక

కంప్యూటర్లు, ఫర్నిచర్‌ లేక అవస్థలు

పాఠశాలల్లో బోధకులు లేని వైనం

ఫలితంగా అంతంతా మాత్రంగానే

డిజిటల్‌ బోధన

పాఠశాలలకు నెట్‌ సౌకర్యం..

పాఠశాలల్లో గతంలో కంప్యూటర్లకు నెట్‌ సౌకర్యం లేక, బోధకులు లేక మరుగునపడ్డాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కంప్యూటర్లు ఉన్న పాఠశాలల్లో నెట్‌ సౌకర్యం కల్పించేందుకు గానూ రాష్ట్ర విద్యాశాఖాధికారులు జిల్లాలో 148 పాఠశాలలను ఎంపిక చేసి ఆయా పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించేందుకు గానూ బీఎస్‌ఎన్‌ఎల్‌ బాధ్యులతో చర్చ లు జరుపుతున్నారు. చర్చలు సఫలీకృతం అయితే 148 పాఠశాలలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం రానుంది. వీటిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కూడా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని కూలీలైన్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎంపిక జాబితాలో ఉంది. కానీ, అక్కడ ఒక్క కంప్యూటర్‌ కూడా లేకపోవడం గమనార్హం. అక్కడే ఉన్న ఉన్నత పాఠశాలలో కంపూటర్లు ఉన్నప్పటికీ ఫర్నిచర్‌ లేక కిందనే భద్రపరిచారు. చాలా పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉన్న కంప్యూటర్లకు మరమ్మతులు చేయిస్తే స్వచ్ఛంద సంస్థల వారు బోధకులను ఏర్పాటు చేసి కంప్యూటర్‌ విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో నవభారత్‌ ఒకేషనల్‌ ఇన్‌స్టిట్యూ ట్‌ సంస్థ కంప్యూటర్‌ బోధకులకు వేతనాలు చెల్లించి, పాఠశాలలకు పంపించింది.

జిల్లాలో 148 పాఠశాలల ఎంపిక

ఇంటర్‌నెట్‌ సౌకర్యం కోసం జిల్లాలో 148 పాఠశాలలను రాష్ట్ర విద్యాశాఖాధికారులు ఎంపిక చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. దీంతో విద్యార్థులకు మెరుగైన బోధన అందనుంది.

– ఎం.వెంకటేశ్వరాచారి, డీఈఓ

పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌!1
1/1

పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement