
వాహనం ఢీకొని రెండు గేదెలు మృతి
అశ్వారావుపేటరూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని రెండు పాడి గేదెలు మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వినాయకపు రం గ్రామ రైతు మురళీకి చెందిన పాడి గేదెలు ఉద యం మేతకోసం ఆసుపాక రోడ్డు వైపు వెళ్లాయి. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. కాగా, అటువైపుగా వెళ్లిన స్థానికులు గేదెలు మృతి చెంది ఉండటాన్ని గమనించి రైతుకు సమాచారం అందించారు. గేదెల విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని బాధిత రైతు వాపోయాడు.
సెల్ టవర్‌ను దహనం చేసిన మావోయిస్టులు
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి మావోయిస్టులు సెల్‌టవర్‌కు నిప్పంటించి దహనం చేశారు. ఈ ఘటన నారాయణపూర్ జిల్లాలో గల చోటేడోంగేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చోటేడోంగేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మద్నార్‌లోని టవర్‌కు మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి నిప్పంటించారు. సమాచారం అందుకున్న చోటేడోంగేర్ పోలీసులు ఘటనా ప్రాంతంలో వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పేకాట స్థావరంపై దాడి
మణుగూరుటౌన్: మున్సిపాలిటీలోని చినరాయిగూడెం రోడ్డు సమీపంలోని అడవుల్లో పేకాట ఆడుతున్న వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాయి గూ డెం సమీపంలో కొందరు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ రమాకాంత్ దాడి చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.40,350 నగదు, ఐదు సెల్‌ఫోన్లు, ఆటోస్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారని పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
ఖమ్మంక్రైం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. నేలకొండపల్లి మండలం అజయ్‌తండాకు చెందిన గుగులోతు సైదులు(37) మంగళవారం ఖమ్మం రాగా, జిల్లా ఆస్పత్రి ఎదుట రోడ్డు దాటే క్రమాన వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు.
పల్టీ కొట్టిన కారు:
తప్పిన ప్రమాదం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం గొల్లగూడెం రోడ్డులో రెండు కార్లు ఢీకొనగా, ఓ కారు డీవైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఖమ్మంకు చెందిన సుధాకర్ మంగళవా రం తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్తుండగా వెనక నుండి మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుధాకర్ కారు బోల్తా పడగా అందులో ఉన్న వారు స్వ ల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ సమయాన వాహనాల రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా ఖమ్మం అర్బన్ పోలీసులు చేరుకుని రాకపోకలను క్రమబద్ధీకరించారు.