
●బోర్డు చాటు తెర..
ఆ పాఠశాలలోని తరగతి గదిలో ఓ వినూత్న ప్రయోగం చేశారు. స్లైడింగ్ బోర్డు ఏర్పాటు చేశారు. ముందు ఆకుపచ్చ రంగులో ఉన్న బోర్డు కనిపిస్తుంది. దానిని పక్కకు జరిపితే లోపల డిజిటల్ తెర (టీవీ) కనిపిస్తుంది. అవసరమైనప్పుడు బోర్డుపై పాఠాలు బోధిస్తారు. లేదా బోర్డును జరిపి డిజిటల్ క్లాసులు చెబుతారు. ఇలా సాంకేతికత తరగతి గదుల్లోకి చొచ్చుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ స్లైడింగ్ బోరుకరకగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉంది. –కరకగూడెం