
గోర్‌బోలి భాషను అధికారికంగా గుర్తించాలి
కొత్తగూడెంఅర్బన్: బంజారులు మాట్లాడే గోర్‌బోలి భాషను అధికారికంగా గుర్తించి 8వ షెడ్యూల్లో చేర్చాలని వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తగూడెం మార్కెట్ యార్డ్‌లో లంబాడీ (బంజారా)సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని, ట్రైకార్ రుణాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు. ఐటీడీఏల్లో బ్యాక్ లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, వేంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న ప్రతీ చోట భగవాన్ హతీరామ్ బావాజీ గుడి నిర్మించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు లాగే హతీరామ్ బావాజీ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రాజేష్ నాయక్, ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, బానోత్ రాములు నాయక్, హతిరామ్‌నాయక్, వీరూనాయక్, వెంకట్ నాయక్, సీతారాంనాయక్, రవి నాయక్, లాల్ సింగ్ నాయక్, బాబులాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.