
అట్రాసిటీ కేసుపై విచారణ
జూలూరుపాడు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళ రజనీ జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శనివారం విచారణ అధికారి, ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను వెంగన్నపాలెంలోని బాధితురాలు రజనీ ఇంటికి వెళ్లి విచారించారు. ఈ విషయంపై డీఎస్పీ చంద్రభానును వివరణ కోరగా అట్రాసిటీ కేసు విచారణ నిమిత్తం వచ్చామని, బాధితురాలు, సాక్షుల నుంచి వివరాలు సేకరించామని, సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు.