
20 మందిపై కేసు
పాల్వంచరూరల్: భూమిని అక్రమంగా చదును చేస్తున్న 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన గొల్లమారి రత్నారెడ్డికి మండలంలోని రెడ్డిగూడెంలో భూమి ఉంది. అందులోకి మంగళవారం వేపలగడ్డ గ్రామానికి చెందిన మోరే రవి, అశ్వాపురం మండలం వెంకటాపురంవాసులు కొందరు ప్రవేశించి భూమిని చదును చేస్తున్నారని భూ యజమాని ఫిర్యాదు చేశా డు. 20 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమో దు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు. కాగా, సాగు లో ఉన్న ఆదివాసీలు, నిరుపేద రైతులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి నిరసనగా గిరిజనులు రెడ్డిగూడెం శివారులోని భూమి వద్ద, తర్వాత పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి బెదిరించడం తగదని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పున్నం చంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పది మందిపై కేసు
పాల్వంచరూరల్: భూ వివాదం కారణంగా జరిగిన ఘర్షణలో ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేయగా పదిమందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మండలంలోని నాగారంకాలనీకి చెందిన సపావత్ సరస్వతి తన భూమిలో అక్రమంగా ప్రవేశించారని భూక్యా భద్రుతో ఈనెల 5వ తేదీన వివాదం జరిగింది. మంగళవారం భూక్యా భద్రు, గుగులోతు రమేశ్, విజయ, జి.ధన్‌సింగ్, రాములు తనపై దాడి చేశారని సరస్వతి ఫిర్యాదు చేయగా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. తమఫై దాడి చేశారని విజయ ఫిర్యాదు చేయగా సరస్వతి, వెంకటేశ్వర్లు, మోతీలాల్, దగ్మా, సంధ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.