
కరకట్ట నిర్మాణం పూర్తి చేయాలి
భద్రాచలంటౌన్: గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజల రవాణా మార్గానికి ఇబ్బందులు లేకుండా కొత్తగా చేపడుతున్న కరకట్ట నిర్మాణ పనులను ఇరిగేషన్ శాఖ అధికారులు త్వరితగతిన పూర్తి చేయా లని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కోరారు. సుభాష్‌నగర్, కూనవరం రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న కరకట్ట స్లూయిస్ పనులు, విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న స్లూయిస్‌లను పీఓ బి.రాహుల్‌తో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. గోదావరి వరద హెచ్చుతగ్గులతో ఉన్నందున ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలు, అన్నదాన సత్రం, పట్టణంలోని డ్రెయినేజీలు నిండిపోయి వరద నీరు రోడ్డుపైకి రాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచిచారు. విస్తా కాంప్లెక్స్ స్లూయిస్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన మోటార్లు సక్రమంగా పనిచేసేలా ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఈసారి వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంత, పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని శ్రీసీతారామ క్లబ్‌లో రూ.5 లక్షలతో నిర్మించిన టాయిలెట్ల సముదాయాన్ని ఎమ్మెల్యే, పీఓ ప్రారంభించారు.