
కమ్యూనిస్టులతోనే సమస్యల పరిష్కారం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కూనంనేని సాంబశివరావు
కారేపల్లి: కమ్యూనిస్టులు అండగా నిలిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కారేపల్లి మండలం మాధారంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికే పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. పదవులు ఉన్నా, లేకున్నా పేదవారి పక్షాన పోరాడేతత్వం కమ్యూనిస్టులకు ఉంటుందని తెలిపారు. కాగా, డిసెంబర్ 26న సీపీఐ వందేళ్ల వేడుకల ముగింపు సభ ఖమ్మంలో నిర్వహించనున్నామని వెల్లడించారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ విధానాలతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్న విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు భాగం హేమంతరావు, యర్ర బాబు, సీతామహాలక్ష్మి, రావి రామకృష్ణ, ఉంగరాల సుధాకర్, పాపినేని సత్యనారాయణ, బట్టు సంగయ్య, చెన్నంశెట్టి భూషయ్య, దళ్‌సింగ్, బట్టు సంగయ్య, బి.వీరునాయక్, కొల్లి వీరయ్య, రాయల రామారావు, పోతనబోయిన సహదేవ్, పి.రవి తదితరులు పాల్గొన్నారు.