
● అంతర్గత వీధులపై పట్టింపేది ?
అశ్వారావుపేట: నూతనంగా మున్సిపాలిటీ హోదా పొందిన అశ్వారావుపేటలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. 100 రోజుల కార్యాచరణ సక్రమంగా అమలుకాక ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. బస్టాండ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో వాణిజ్య చెత్త అధికంగా ఉత్పన్నం అవుతోంది. హోటళ్లు, మాంసం, చేపల దుకాణాలు, ఇతర దుర్వాసన వెదజల్లే వ్యర్థాలు రోడ్లపైనే వేస్తున్నారు. అయితే ప్రధాన రహదారిపై రోజూ చెత్త సేకరిస్తున్న సిబ్బంది అంతర్గత రోడ్లను మాత్రమ పట్టించుకోవడం లేదు. డ్రెయినేజీల్లో పూడికతీత పనులు సైతం సక్రమంగా లేక సిల్ట్ పేరుకుపోతోంది.