
ఫిట్నెస్లేని మూడు బస్సులు సీజ్
ఇల్లెందు: పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన మూడు బస్సులను సీజ్ చేఽశారు. బుధవారం ఇల్లెందు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.నిర్మల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇల్లెందు పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులతో కళాశాలకు వస్తుండగా జేకే బస్టాప్ సమీపంలో తనిఖీ చేశారు. ఫిట్నెన్ లేని కారణంగా మూడు బస్సులను సీజ్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కొంత కాలంగా పట్టణంలో పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన బస్సులను ఫిట్నెస్ లేకుండా తిప్పుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీఓ అధికారులు విద్యాసంస్థల బస్సులను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని ఇతర సంస్థల బస్సులను కూడా తనిఖీ చేస్తామని ఇన్స్పెక్టర్ నిర్మల తెలిపారు.