
● నిల్వ సామర్థ్యం లేక ఇక్కట్లు
ఇల్లెందు: ఇల్లెందులోని 13వ నంబర్ బస్తీ 16వ వార్డులో రెండు గదుల రేకుల షెడ్డులో రేషన్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక నెలకు సరిపడ బియ్యం కూడా నిల్వచేసే పరిస్థితిలేదు. దీంతో మూ డు నెలల స్టాక్‌ను ఐదు దఫాలుగా అందజేశారు. ఈ షాపు పరిధిలో 730 రేషన్ కార్డులు ఉండగా ఇప్పటికి 630 మందికి బియ్యం పంపిణీ చేశారు. కొందరు వృద్ధులకు వేలిముద్రలు పడకపోవడంతో ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రేషన్ అందజేస్తున్నారు. కాగా, తమకు మూడు నెలలుగా కమీషన్ ఇవ్వడం లేదని డీలర్లు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రతీ నెల కమిషన్ ఇవ్వాలని కోరుతున్నారు.