గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలి
గుండాల: గిరిజన ప్రాంతాల యువత అన్ని రంగాల్లో ముందుండాలని, భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదగాలని అడిషనల్ ఎస్పీ నరేందర్ ఆకాంక్షించారు. ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశాల మేరకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గిరిజన యువతను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశామని, అందులో భాగంగానే రవాణాశాఖ అధికారుల సహకారంతో మండలంలోని 100 మంది యువకులకు డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించామని చెప్పారు. గిరిజన యువతకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని, క్రీడాపోటీలు, వైద్యశిబిరాల నిర్వహణ, ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సాహం లాంటి కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని యువకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్, కానిస్టేబుల్ శంకర్‌ను అభినందించినారు. ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, గుండాల సీఐ రవీందర్, ఎస్‌ఐ సైదా రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.
30 డొమెస్టిక్ సిలిండర్ల సీజ్
కొత్తగూడెంఅర్బన్: జిల్లా పౌరసరఫరాలశాఖ అధికా రులు కొత్తగూడెం, రామవరం, చుంచుపల్లిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కమర్షియల్‌కు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లు వాడు తుండగా.. వాటిని సీజ్ చేశారు. 15 హోటళ్లు, రెస్టారెంట్లలో 30 సిలిండర్లు సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి మహేశ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలి


