గ్రామాల్లోనూ కంటైనర్‌ గృహాలు | - | Sakshi
Sakshi News home page

గ్రామాల్లోనూ కంటైనర్‌ గృహాలు

Jun 20 2025 5:45 AM | Updated on Jun 20 2025 5:45 AM

గ్రామ

గ్రామాల్లోనూ కంటైనర్‌ గృహాలు

ఖర్చు తక్కువ.. అన్ని వసతులు

నచ్చిన కొలతల్లో తయారీకి

అవకాశం

కొణిజర్ల: ఇప్పటి వరకు నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, చిన్నపాటి ఆఫీసులుగా చూసిన కంటైనర్‌ ఇళ్లు ఇప్పుడు అందరికీ చేరువవుతున్నాయి. ఇష్టం వచ్చిన రీతిలో త్వరగా సమకూర్చుకునే అవకాశం ఉన్నందున గ్రామాల్లోనూ పలువురు వీటిని ఆర్డర్‌పై తయారు చేయించుకుంటున్నారు.

దూలపల్లిలో తయారీ..

కొణిజర్ల వాసి చింతల సతీష్‌కు ఇక్కడ 300 చదరపు అడుగుల స్థలం ఉంది. ఈ స్థలంలో బేస్‌మెంట్‌ నిర్మించాక ప్రీ ఫ్యాబ్రికేట్‌ ఇళ్లు సిద్ధం చేసి ఇస్తున్నారని తెలియడంతో హైదరాబాద్‌ కొంపల్లి సమీపాన దూలపల్లిలోని సంస్థను సంప్రదించాడు. దీంతో కిచెన్‌, హాల్‌, సింగిల్‌ బెడ్‌ రూమ్‌ అటాచ్డ్‌ బాత్‌రూమ్‌తో కంటైనర్‌ రూపంలోని ఇళ్లు తయారుచేసి ఇచ్చారు. ప్రత్యేక వాహనంపై తీసుకొచ్చి ముందే నిర్మించిన బేస్‌మెంట్‌పై ఫిట్‌ చేయించాడు. తనకు ఉన్న స్థఽలం కొలతల ఆధారంగా ఇంటిని సిద్ధం చేయించుకున్న సతీష్‌ ఇందుకోసం రూ.6 లక్షల వ్యయమైందని, జీఎస్‌టీ, రవాణా కలిపి మరో రూ.లక్ష వెచ్చించానని చెబుతున్నారు. ఇంటీరియర్‌ డిజైన్‌తో పాటు వాటర్‌, హీట్‌, ఫైర్‌ ఫ్రూప్‌గా ఉండి ఏడాది వారంటీతో ఇచ్చారని వెల్లడించాడు. కాగా, ఈ ఇంటిని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. సింగిల్‌ బెడ్‌రూమ్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌తో పాటు నచ్చిన కొలతలతో ఇంటి నిర్మాణానికి అవకాశం ఉండడంతో పలువురు సంస్థను సంప్రదించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ ఇళ్లలో కాస్తంత ఎత్తు తక్కువగా ఉండడం కొంత లోపంగా చెబుతున్నారు. సాధారణంగా ఇళ్లు పది అడుగుల ఎత్తులో నిర్మిస్తుంటే ఈ క్యాబినెట్‌ ఇల్లు మాత్రం 9 అడుగుల ఎత్తులోనే ఉంది.

గ్రామాల్లోనూ కంటైనర్‌ గృహాలు1
1/2

గ్రామాల్లోనూ కంటైనర్‌ గృహాలు

గ్రామాల్లోనూ కంటైనర్‌ గృహాలు2
2/2

గ్రామాల్లోనూ కంటైనర్‌ గృహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement