నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలి
సీడబ్ల్యుసీఈ అధికారి పృథ్వీరాజ్
కరకగూడెం: నీటి సంరక్షణ పద్ధతులపై గ్రామీణ ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీరింగ్ (సీడబ్ల్యుసీఈ) పృథ్వీరాజ్ సూచించారు. గురువారం జలశక్తి అభియాన్ కార్యక్రమ పర్యవేక్షణలో భాగంగా మండలంలోని అనంతారం, సమత్ మోతె, వట్టంవారి గుంపు, తాటిగూడెం, కరకగూడెం, సమత్ భట్టుపల్లి, కన్నాయిగూడెం గ్రామాలను సందర్శించారు. ఇంకుడు గుంతలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల, నీటి నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాజు, భాస్కర్, కృష్ణయ్య, పాపయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.


