
అంతా రహస్యమే..!
● అప్పారావుపేట ఫ్యాక్టరీలో ఏ విషయమూ బయటకు రాదు ● ఆయిల్‌ఫెడ్‌లో అంతా అయోమయం.. ● గంటకు 90 టన్నుల క్రషింగ్ వట్టిమాటేనా..?
అశ్వారావుపేట: B BƇ¬ÌŒ òœyŠæ ¸ëÅMýStÈÌZ A…™é Æý‡çß çÜÅÐól$. AMýSPyýl H… 糯]l$Ë$ ^ólÔ>Æý‡$..°Æý‡Óçß × GÌê E…§ýl¯ól ÑçÙĶæ*Ë$ ºÄ¶æ$rMýS$ Æ>Ð]l#. AÌê Æ>MýS$…yé ™ðlË…V>× BƇ¬ÌŒ òœyŠæ A«¨M>Æý‡$Ë$, K BÝ릯]l M>…{sêMýStÆŠæḥ^èlÆý‡ÅË$ ^ólç³yýl$™èl$…sêÆý‡¯ól ÑÐ]l$Æý‡ØË$ E¯é²Æ‡¬. ÑÐ]l-Æ>ÌZÏMìS Ððlã™ól.. §ýlÐ]l$Ã-õ³r Ð]l$…yýl-ÌS… A´ëµ-Æ>Ð]l#-õ³-rÌZ Æý‡*.100 MørÏ A糚-™ø 2016ÌZ VýS…rMýS$ 30 r¯]l$²ÌS {MýSíÙ…VŠæ ÝëÐ]l$-Æý‡¦Å…™ø {ç³ç³…^èl Ýë¦Æ‡$$ ¸ëÅMýSt-Ȱ °ÇÃ…-^éÐ]l$° ¯ésìæ ´ëÌS-MýS$-Ë$ Vöç³µ-Ë$ ^ðl´ëµÆý‡$. AƇ$$™ól D ¸ëÅMýSt-ÈOò³ B¨ ¯]l$…` ç³Ë$ ÑÐ]l$-Æý‡Ø-Ë$ ÐðlË$Ï-Ððl-™èl$¢-™èl$¯é².. §ýlÐ]l$Ã-õ³r Ð]l$…yýlÌS ç³Ç«¨ÌZ°¨ M>Ð]l-yýl…-™ø H© ºÄ¶æ$-rMýS$ ´÷MýSP-±Ä¶æ$-MýS$…yé AMýSPyìl ¯éĶæ$-MýS$-Ë$, A«¨M>Æý‡$-Ë$, ´ëÌS-MýS$-Ë$ gê{VýS™èl¢ ç³yól-ÐéÆý‡$. AÌê Aѱ† Ðólâ¶æ*Ï-¯]l$-MýS$-´ùƇ$$ MýS$…¿ýæ-Mø×êÌSMýS$ §éÇ ¡íÜ…¨.
సంగతేంటంటే..
అప్పారావుపేట ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 90 టన్నులకు విస్తరిస్తూ గత ప్రభుత్వం రూ.50 కోట్లతో పనులు ప్రారంభించగా 9 నెలల క్రితం పూర్తయ్యాయి. కానీ ఫ్యాక్టరీ సామర్థ్యం 90 టన్నులకు చేరలేదు. ఈ విషయాన్ని ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని కాంట్రాక్టర్‌కు బిల్లులు ఆపినట్లు సమాచారం. అయితే ఫ్యాక్టరీలో ఎలాంటి మార్పులు చేయకున్నా.. కొంత కాలం తర్వాత ఓ మంత్రి సూచనతో బిల్లు చెల్లించినట్లు తెలిసింది. ఇక 90 టన్నుల క్రషింగ్ సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీ.. ప్రస్తుతం ఎంత మేర చేస్తుందనేది కూడా ఎవరికీ తెలియనివ్వరు. ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ మొదలు జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి వరకు ఎవరినడిగినా వాస్తవాలు వెలుగులోకి రావు. పైగా ఇది అడగరాని విషయమని అంటారు. గతంలో ఏపీకి చెందిన వెయ్యి టన్నుల ఆయిల్‌పామ్ గెలలను క్రషింగ్ చేసిన సమయంలో రోజుకు ఎన్ని టన్నులు జరిగిందో ఫ్యాక్టరీ రికార్డుల్లో నమోదై ఉంటుంది. కానీ ఆ వివరాలూ కూడా వెల్లడించరు.
మార్పులకు అవకాశం లేదా ?
ఫ్యాక్టరీని 90 టన్నుల సామర్థ్యానికి తీసుకొచ్చేందుకు అవసరమైన మార్పులు చేపట్టలేని విధంగా నిర్మించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా చేయాలంటే ఫ్యాక్టరీలోని కీలక భాగాలను పూర్తిగా తొలగించాల్సిందేనని తెలుస్తోంది. బ్రాయిలర్ గంటకు 90 టన్నుల క్రషింగ్‌కు సరిపడా స్టీమ్‌ను ఉత్పత్తి చేయగలిగినా ప్లాంటుకు విడుదల చేయలేదని నిపుణులు తేల్చినట్టు సమాచారం. అంతే కాక స్టెరిలైజర్లు 90 డిగ్రీల వ్యత్యాసంతో అమర్చడంతో ఆయిల్ రికవరీపైనా దుష్ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇన్ని అనర్థాలు ఉన్నా.. మచ్చలేని మంత్రిగా చెలామణి అయ్యే ఓ రైతుబాంధవుడి పాత్ర ఉండడం వల్లే ఏ విషయమూ బయటకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లోపాలుంటే సరి చేస్తాం
తెలంగాణలో ఆయిల్‌ఫెడ్‌ను ఉన్నత స్థానంలో ఉంచేందుకు, ఫ్యాక్టరీలు నిర్మించేందుకు మేం చాలా కష్టపడుతున్నాం. ఫ్యాక్టరీ క్రషింగ్‌లో లోపాలుంటే సరిచేయిస్తాం. కొందరు కావాలని తప్పుడు ప్రచా రం చేస్తున్నారు. క్రషింగ్ వివరాలు త్వరలో వెల్లడిస్తాం.
– సుధాకర్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ జీఎం