సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఇల్లెందురూరల్ : వర్షాకాలం ప్రారంభంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి భాస్కర్‌నాయక్ సూచించారు. మండలంలోని రొంపేడు పీహెచ్‌సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. మందుల నిల్వలను పరిశీలించి రోజువారీ ఓపీ, ఐపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. గర్భిణులను క్రమం తప్పకుండా పరీక్షించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని అన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, రొంపేడు పీహెచ్‌సీ వైద్యాధికారిణి కవిత తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్


