
గిరిజన సొసైటీలను సద్వినియోగం చేసుకోవాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం: పీసా యాక్ట్ ప్రకారం గిరిజన మహిళల కోసం కేటాయించిన ఇసుక సొసైటీలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న మహిళా సొసైటీల సభ్యులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న గిరిజన మహిళలు కాంట్రాక్టర్లను, బినామీలను నమ్మి మోసపొవద్దని సూచించారు. మహిళలందరూ ఐక్యంగా ఉండి గోదావరిలో ఇసుక వెలికితీత, నిర్వహణ బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసా స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్, తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ శంకర్ నాయక్, ఏడీ మైన్స్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.