‘బీమా’తో కుటుంబానికి ఆర్థిక భరోసా | - | Sakshi
Sakshi News home page

‘బీమా’తో కుటుంబానికి ఆర్థిక భరోసా

May 23 2025 2:03 AM | Updated on May 23 2025 2:03 AM

‘బీమా

‘బీమా’తో కుటుంబానికి ఆర్థిక భరోసా

బూర్గంపాడు: కుటుంబ ఆర్థిక భరోసాకు జీవిత బీమా తప్పనిసరని తెలంగాణ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ నాగరాజు అన్నారు. గురువారం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని తమ బ్యాంకులో జీవిత బీమా చేసి ప్రమాదవశాత్తు, సహజ మరణాలు పొందిన తొమ్మిది మంది కుటుంబాలకు రూ.36 లక్షల విలువైన చెక్కులను అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఆర్థిక లబ్ధి చేకూరే బీమా పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంక్‌ మేనేజర్‌ ఆర్‌.నరేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు సునీల్‌కుమార్‌, రమేష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌, రామకృష్ణ, సాయి కృష్ణ, పాషా, ఐకేపీ ఏపీఎం నాగార్జున, ఎస్‌బీఐ బిజనెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ నందు, గ్రీష్మ తదితరులు పాల్గొన్నారు.

జనావాసాల్లోకి దుప్పి..

అశ్వారావుపేటరూరల్‌: అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన ఓ చుక్కల దుప్పి అశ్వారావుపేట పట్టణంలో హల్‌చల్‌ చేసింది. గురువారం మధ్యాహ్న సమయంలో అటవీ ప్రాంతం నుంచి పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక వీధిలో ఉన్న జనవాసాల్లోకి వచ్చింది. గమనించిన స్థానికులు సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీయడంతో ఆందోళనకు గురై పరుగులు తీసింది. దీంతో బీఎస్‌ఆర్‌ నగర్‌ మీదుగా ఇందిరా కాలనీ నుంచి అల్లిగూడెం గ్రామం వైపు వెళ్లింది. సమాచారం అందుకున్న స్థానిక ఫారెస్టు రేంజర్‌ మురళి ఆధ్వర్యాన దుప్పిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది అటవీ సిబ్బందికి చిక్కకుండా అల్లిగూడెం సమీపంలో గల వ్యవసాయ క్షేత్రాలను దాటుకుని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దాదాపు గంటపాటు పట్టణంలోని ఇళ్లల్లోకి వెళ్లి దుప్పి హల్‌చల్‌ చేయడంతో స్థానికులు చూసేందుకు పోటీ పడ్డారు.

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

కొత్తగూడెంఅర్బన్‌: ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మంచిర్యాల జిల్లాలో జరగనున్న టైసన్‌ కప్‌ ఓపెన్‌ రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ మేరకు గురువారం బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా ప్యాట్రన్‌ ఝెర్రా కామేష్‌ వివరాలు వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారుల్లో సబ్‌ జూనియర్స్‌ విభాగంలో గోనెల నిశాంత్‌ కుమార్‌, దాసరి హేమంత్‌, రాచకట్ల వినయ్‌, బొల్లోజు మహేశ్‌, ఆముదాల విజయ్‌ భాగ్యేష్‌, జూనియర్స్‌ విభాగంలో జిజుల అజిత్‌, గోనెల అక్షయ్‌ కుమార్‌ ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా జనరల్‌ సెక్రటరీ వై.శివసుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడు షమీవుద్దీన్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాలోత్‌ రాజా, ధనుంజయ్‌, సుహాష్‌ అద్వైత్‌, నున్న శివ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం

మేరకే నష్టపరిహారం

అశ్వారావుపేటరూరల్‌: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు కింద నిర్మించే కాలువ నిర్మాణాల్లో సాగు భూములను కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వ నిర్ణయించిన నష్ట పరిహారం మేరకే చెల్లిస్తామని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జె.కార్తీక్‌ తెలిపారు. గురువారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గ్రామసభను నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రాజెక్టుకు సంబంధించిన కాలువ నిర్మాణాలకు అవసరమైన భూములను సేకరిస్తున్నామని, ఎమైనా అభ్యంతరాలు ఉంటే వెల్లడించాలని చెప్పారు. ప్రాజెక్టు ద్వారా అశ్వారావుపేట మండలంలో సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, నష్టపోతున్న రైతులు సహకరించాలని కోరారు. ఈ గ్రామసభలో మున్సిపాలిటీ కమిషనర్‌ సుజాత, డీటీ రామకృష్ణ, ఇరిగేషన్‌ డీఈ కృష్ణ, ఏఈఈ కేఎన్‌బీ కృష్ణ, ఆర్‌ఐలు తాటి కృష్ణ, పద్మావతి, సిబ్బంది పాల్గొన్నారు.

‘బీమా’తో కుటుంబానికి ఆర్థిక భరోసా
1
1/3

‘బీమా’తో కుటుంబానికి ఆర్థిక భరోసా

‘బీమా’తో కుటుంబానికి ఆర్థిక భరోసా
2
2/3

‘బీమా’తో కుటుంబానికి ఆర్థిక భరోసా

‘బీమా’తో కుటుంబానికి ఆర్థిక భరోసా
3
3/3

‘బీమా’తో కుటుంబానికి ఆర్థిక భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement