
నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
పినపాక: నాటుసార విక్రయించడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ శాఖ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి దుగినేపల్లి గ్రామానికి చెందిన భూఖ్య రామారావు జానంపేటలో నాటు సారా విక్రయించడానికి వెళ్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతని వద్ద ఎనిమిది లీటర్ల నాటు సారాతో పాటు ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. నాటు సారా విక్రయించిన, తయారు చేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనిఖీల్లో సిబ్బంది పాల్గొన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రి డయాలసిస్ కేంద్రం సీజ్
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అవకతవకలు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలడంతో ఆస్పత్రి కేంద్రంలోని డయాలసిస్ కేంద్రాన్ని సీజ్ చేసినట్లు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ తేజశ్రీ వెల్లడించారు. గురువారం ఆస్పత్రిని తనిఖీ చేసి సీజ్ చేశామన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద తప్పనిసరిగా ప్రమాణాలు పాటించి సౌకర్యాలు కల్పించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ నాగభూషణం, డిప్యూటీ డెమో ఎండీ.ఫైజామోహిఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్