
కల్వర్టును ఢీ కొట్టిన కంటైనర్..
బూర్గంపాడు: ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో కల్వర్టును ఢీ కొట్టిన ఘటనలో కంటైనర్ లారీ డ్రైవర్ మృతిచెందాడు. గురువారం సారపాకలో జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు ఇలా తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరెడ గ్రామానికి చెందిన ఐతరాజు నరేశ్(35) కంటైనర్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనేపథ్యాన గురువారం కంటైనర్‌లో పేలుడు పదార్థాల లోడ్‌తో ఒడిశా వెళ్తున్న క్రమంలో సారపాక సంత సమీపాన ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో పక్కనే ఉన్న కల్వర్టును వేగంగా ఢీ కొట్టాడు. దీంతో నరేష్‌కు తీవ్ర గాయాలతో క్యాబిన్‌లో ఇరుక్కుపోగా స్థానికులు, 108 సిబ్బంది శ్రమించి బయటకు తీశాక భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్థారించగా.. ఘటనా స్థలాన్ని పాల్వంచ డీఎస్పీ సతీష్, సీఐ సతీష్ పరిశీలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
డ్రైవర్ మృతి