
ఇంకుడుగుంతలతోనే నీటి సంరక్షణ
మణుగూరు రూరల్: ఇంకుడు గుంతల ఏర్పాటుతోనే నీటి సంరక్షణ, భూగర్భ జలాలను పెంపొందించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి వి.చంద్రమౌళి తెలిపారు. గురువారం మండల పరిధిలోని లంకమల్లారం, సమితిసింగారం, గుట్టమల్లారం, ముత్యాలమ్మనగర్‌గ్రామపంచాయతర్ల్ ఇంకుడుగుంతలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నీటి వృథాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇంటింటికి ఇంకుడుగుంతలు తప్సనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, బోరు బావి, చేతిపంపుల వద్ద కూడా వీటిని ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత లేకుండా ఉంటుందన్నారు. నేల స్వభావాన్ని, పరిసరాలను బట్టి ఈ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీడీఓ తేళ్లూరి శ్రీనివాసరావు, ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.