
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి
కొత్తగూడెంఅర్బన్: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప మహానీయుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి అని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ కొనియడారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో భాగ్యరెడ్డి జయంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు రెహమాన్ భాగ్యరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాల ఫలితంగా వర్మ బిరుదు పొందిన ఆయన అణగారిన, దళితుల అభివృద్ధికి, విద్యాసంస్థలు నెలకొల్పి వారి జీవితాల్లో విద్యతో వెలుగులు నింపారని కొనియాడారు. జగన్ మిత్ర మండలిని స్థాపించి దళితుల చైతన్యం కోసం పాటుపడ్డారని, దేవదాసి, జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి వారి కోసం కృషి చేసిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్‌ఐ లాల్‌బాబు, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎంటీఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్‌ఐ కృష్ణారావు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.