
ధాన్యం దిగుమతిలో ఆలస్యం
ఇల్లెందు: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యంతో లారీలు మిల్లుల వద్దకు వస్తుండగా గోదాంల్లో స్థలం లేదని, సరిపడా హమాలీలు లేరంటూ దిగుమతిలో జాప్యం జరుగుతోంది. దీంతో రోజుల తరబడి ఆలస్యం జరుగుతుండగా తాము నష్టపోతున్నామని లారీల యజమానులు వాపోతున్నారు. ఇల్లెందు సుభాష్‌నగర్‌లోని ఓ బాయిల్డ్ రైస్ మిల్లు వద్ద సోమవారం 30 లారీల మేర నిలిచిపోయాయి. ఒకేసారి ఎక్కువ లారీలు రావడంతో తగినంత మంది హమాలీలు లేక దిగుమతిలో జాప్యం జరి గింది. అంతేకాక మిల్లుల్లో స్థలభావం మరో కారణంగా చెబుతున్నారు. అయితే, ఇల్లెందు వ్యవసాయ మార్కెట్‌లో గోదాం ఉన్నా ఉన్నతాధికారుల అనుమతి లేనిదే అక్కడకు పంపించే పరిస్థితి లేదు. కాగా, లారీ ఒక రోజు ఆగితే సుమారు రూ.8వేల వరకు నష్టం వస్తోందని యజమానులు వాపోతున్నారు. అంతేకాకడ్రైవర్లు, క్లీనర్లు తిండి, నీటికి ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై ఇల్లెందు సివిల్ సప్లయీస్ డీటీ యాకూబ్ పాషాను వివరణ కోరగా.. ఇల్లెందు మిల్లులో స్థలం కొరత, ఇతర సమస్యలతో పాటు మార్కెట్ గోదాంను ఉపయోగించుకునే అంశాన్ని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
మిల్లు ఎదుట లారీల బారులు