
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పలు ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డ్యామ్‌పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 406 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖ రూ.22,885 ఆదాయం లభించింది.
మరమ్మతులకు గురైన బోట్లు
కిన్నెరసానిలో మూడు బోట్లు మరమ్మతులకు గురయ్యాయి. ఇంజన్ చెడిపోవడంతో నెల రోజుల క్రితం స్పీడ్ బోటును మరమ్మతుల నిమిత్తం హైదరాబాద్‌కు పంపారు. ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదు. తాజాగా ఆదివారం 50 మంది సామర్థ్యం కలిగిన పెద్ద బోటు, మరో చిన్న బోటు ఇంజన్లు కూడా చెడిపోయాయి. దీంతో జలాశయంలో బోటు షికారు నిలిచిపోయింది. ఫలితంగా పర్యాటకులు నిరాశకు గురయ్యారు. వేసవి సెలవులు కావడంతో పర్యటకుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం సుమారు రూ. 15 వేల ఆదాయం కోల్పోయినట్లు తెలుస్తోంది. అయినా టూరిజం కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడంలేదు.