
పహల్గామ్ మృతులకు న్యాయమూర్తుల సంతాపం
కొత్తగూడెంటౌన్: పహల్గాంలో ఉగ్రవాద దాడిలో మృతి చెందినవారికి జిల్లా న్యాయమూర్తులు శుక్రవారం సంతాపం తెలిపారు. కొత్తగూడెం జిల్లా కోర్టులోని లైబ్రరీ హాల్‌లో జరిగిన సంతాప కార్యక్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ ఉగ్రవాద దాడి హేయమైన చర్య అని అన్నారు. ఆ తర్వాత నూతన జడ్జిలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్.సరిత, కె. కిరణ్‌కుమార్, ఎం.రాజేందర్, ఏ.సుచరిత, కె.సాయిశ్రీ, బి.రవికుమార్, రాజమల్లు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జే.గోపికృష్ణ, సభ్యులు కాసాని రమేష్, కె.చిన్నికృష్ణ, ఉప్పు అరుణ్, మాలోత్ ప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు.