
రమణీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం రమణీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయ స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏలూరు జిల్లాకు చెందిన నారాయణ–రుక్మిణీదేవి దంపతులు మంగళవారం రూ.లక్ష చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది వారికి స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందించారు. ఆలయ పీఆర్వో సాయిబాబు తదతరులు పాల్గొన్నారు.
రాజీమార్గంలో కేసులు పరిష్కరించాలి
● న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్
కొత్తగూడెంటౌన్: చెక్ బౌన్స్ కేసుల్లో రాజీమార్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ అన్నారు. కొత్తగూడెం జిల్లా కోర్టులో బ్యాంకు, ఆర్థిక సంస్థల అఽధికారులు, ప్రతివాదులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు లోక్ అదాలత్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కొత్తగూడెం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.
సీసీఎస్ అధికారులకు ఎస్పీ అభినందన
కొత్తగూడెంటౌన్: రాష్ట్ర డీజీపీ జితేందర్ చేతుల మీదుగా ఈనెల 26న ప్రశంసాపత్రాలు అందుకున్న సీసీఎస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ రోహిత్‌రాజు మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రా – ఒడిశా ఆటవీ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సమర్థంగా అడ్డుకోవడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, సిబ్బంది రవి, విజయ్, రామకృష్ణ భాస్కర్, వెంకటనారాయణ పాల్గొన్నారు.
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత
కొత్తగూడెంఅర్బన్: ప్రయాణికుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి, నిరంతరం నిఘా పెంచుతున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, ఆర్‌సీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మట్టే సాయి తెలిపారు. భద్రతపై రైలు ప్రయాణికులకు, నిబంధనలపై ఆటో డ్రైవర్లకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి స్టేషన్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రైల్వే ట్రాక్‌లను దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వదిలేసిన లగేజీలను గుర్తిస్తే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని, భద్రాచలం రోడ్డులోని ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రమణీయం.. రామయ్య కల్యాణం

రమణీయం.. రామయ్య కల్యాణం