
అల్లాడుతున్న మూగజీవాలు
పాల్వంచరూరల్/టేకులపల్లి: అధిక ఉష్ణోగ్రతలతో పశువులు, గేదెలు అల్లాడిపోతున్నాయి. ఎండ వేడిమికి బురద, బూడిద నీరు కూడా తాగి దాహార్తి తీర్చుకుంటున్నాయి. ఎక్కడ చెట్లు కనబడితే అక్కడ నీడలో సేదతీరుతున్నాయి. పాల్వంచ మండలం సూరారం, బిక్కుతండా, సోములగూడెం గ్రామాల మీదుగా కేటీపీఎస్ యాష్‌పాండ్‌లోని కలుషితమైన బూడిదనీరు వాగులో ప్రవహించి కిన్నెరసానిలో కలుస్తుంది. వేసవిలో మేతకు వెళ్లిన పశువులు, మేకలు, గొర్రెలు కలుషిత బూడిద నీటిని తాగి దప్పిక తీర్చుకుంటున్నాయి. టేకులపల్లి మండలం తొమ్మిదోమైలుతండా పాఠశాల, టేకులపల్లి హైస్కూల్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద భారీ వృక్షాలు ఉండగా, నిత్యం పశువులు చెట్ల కిందకు వచ్చి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నాయి.

అల్లాడుతున్న మూగజీవాలు