
విద్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దాలి
చర్ల/దుమ్ముగూడెం: వేసవి సెలవుల అనంతరం తిరిగి ప్రారంభమయ్యే నాటికి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను సుందరంగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. గురువారం చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ఆశ్రమ పాఠశాలలను, వసతి గృహాలను ఆయన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పాఠశాలల్లో కల్పించాల్సిన వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, వార్డెన్‌లు ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయంతో పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. డార్మెటరీ, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, టాయిలెట్, బాత్రూం ఇతర మౌలిక వసతులకు నెల రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. 15 రోజుల్లోగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ డైనింగ్ హాల్ ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. వేసవి సెలవుల్లో పాఠశాలలు అపరిశుభ్రంగా ఉంచకుండా రోజూ శుభ్రం చేయించాలని చెప్పారు. హెచ్‌ఎం సావిత్రి, డీఈ హరీష్, ఏఈ రవి, టీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు
అధికారి రాహుల్