పెద్దమ్మతల్లి ఆలయంలో ముగిసిన ఉత్సవాలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో వైభవంగా సాగుతున్న శ్రీదేవి వసంత నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజున శ్రీరామనవమి కూడా కలిసి రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు నాద నీరాజనం, సూక్తి పారాయణం, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, శ్రీలలితా సహస్రనామ హవనం, పూర్ణాహుతి తదితర పూజలు చేశాక అమ్మవారికి హారతి సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
అమ్మవారిని దర్శించుకున్న
రాజ్యసభ సభ్యుడు..
బీఆర్‌ఎస్‌కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రాచలం శ్రీరామనవమి వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆయన పెద్దమ్మతల్లి సన్నిధికి రాగా.. అర్చకులు, ఈఓ ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.


