భద్రాచలంఅర్బన్ : భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా బస్సులు ఏర్పాటు చేయాలని టీజీఎస్‌ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ కుష్రో షా ఖాన్ అన్నారు. సంస్థ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్యాణానికి వచ్చిన ప్రతీ భక్తుడిని తిరిగి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాలని, అందుకు ఆర్టీసీ ఉద్యోగులంతా కృషి చేసి ప్రయాణికుల మన్ననలు పొందాలని సూచించారు. భద్రాచలం – పర్ణశాల మధ్య కూడా అధిక సంఖ్యలో బస్సులు నడపాలని, తెలంగాణలోని అన్ని రూట్ల ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతో పాటు ఏపీ నుంచి వివిధ డిపోల మేనేజర్లు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఈడీ కుష్రో షా ఖాన్