ఇల్లెందురూరల్: తండ్రి లాంటి వ్యక్తి.. తన అన్న కూతురిపై దాడి చేసి గాయపర్చిన ఘటన మండలంలోని ఒడ్డుగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఒడ్డుగూడేనికి చెందిన శ్రీలత కుటుంబానికి.. ఆమె బాబాయ్ జగదీశ్ కుటుంబానికి మధ్య ఇంటి స్థలం విషయంలో గొడవలు జరగుతున్నాయి. మంగళవారం కూడా గొడవ జరగడంతో జగదీశ్.. శ్రీలతపై దాడి చేసి గాయపర్చాడు. కుటుంబ సభ్యులు ఆమెను ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీలత తండ్రి వీరభద్రం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేసు నమోదు


